e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, July 25, 2021
Home News పెండ్లి ఇంటికి వెళ్లి హిజ్రాల హ‌ల్ చ‌ల్

పెండ్లి ఇంటికి వెళ్లి హిజ్రాల హ‌ల్ చ‌ల్

పెండ్లి ఇంటికి వెళ్లి హిజ్రాల హ‌ల్ చ‌ల్

హైద‌రాబాద్ : హిజ్రాల ఆగ‌డాలు భ‌రించ‌లేనివిగా ఉన్నాయి. నూత‌న గృహ‌ప్ర‌వేశం జరిగినా, కొత్త‌గా ఓ దుకాణం ఓపెన్ చేసినా అక్క‌డ ప్ర‌త్య‌క్ష‌మై డ‌బ్బులు డిమాండ్ చేస్తుంటారు. అడిగినంత డ‌బ్బు ఇవ్వ‌క‌పోతే ఇగ వారి ఆగ‌డాల‌కు హ‌ద్దులే ఉండ‌వు. చిన్న‌పిల్ల‌లు, స్త్రీలు అని కూడా చూడ‌కుండా బ‌ట్ట‌లు విప్పి అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తుంటారు. ఇటువంటి ఘ‌ట‌నే న‌గ‌రంలోని నేరేడ్‌మెట్‌లో గురువారం చోటుచేసుకుంది.

పెళ్లి వారి ఇంటికి వెళ్లిన హిజ్రాలు రూ. 50 వేలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. అడిగినంత‌ ఇవ్వకపోయేస‌రికి బట్టలు విప్పి హంగామా సృష్టించారు. ఆన‌క‌ పెళ్లి వారిపై దాడికి సైతం పాల్ప‌డ్డారు. దీంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానిక పోలీసులు సంఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని హిజ్రాల‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్‌లోనూ హిజ్రాలు బట్టలు విప్పి హంగామా చేశారు. దీంతో హిజ్రాలపై ఐపీసీ 506, 448 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్‌లో న్యూ సెన్స్ క్రియేట్ చేసినందుకు ఐపీసీ 188, 51(b) డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కింద మరో కేసు నమోదు చేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పెండ్లి ఇంటికి వెళ్లి హిజ్రాల హ‌ల్ చ‌ల్
పెండ్లి ఇంటికి వెళ్లి హిజ్రాల హ‌ల్ చ‌ల్
పెండ్లి ఇంటికి వెళ్లి హిజ్రాల హ‌ల్ చ‌ల్

ట్రెండింగ్‌

Advertisement