ఆదివారం 17 జనవరి 2021
Crime - Oct 19, 2020 , 06:26:18

అసోంలో రూ.15.15 కోట్ల హెరాయిన్‌ పట్టివేత

అసోంలో రూ.15.15 కోట్ల హెరాయిన్‌ పట్టివేత

గువహటి: అసోంలోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం చేపట్టిన సోదాల్లో రూ.15.15 కోట్ల విలువైన హెరాయిన్‌ను పోలీసులు పట్టుకున్నారు. దీనికి సంబంధించి ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు కర్బీ ఆంగ్‌లోంగ్‌ పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒక మహిళ కూడా ఉన్నట్టు వెల్లడించారు. మణిపూర్‌ వాసులైన ఇద్దరు వ్యక్తులపై ఎన్‌డీపీఎన్‌ చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రాథమిక దర్యాప్తులో డ్రగ్స్ ఇంఫాల్ నుంచి గువహటికి రవాణా చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. మరో సంఘటనలో పోలీస్‌ సిబ్బంది ఓ ఇంటిపై దాడి చేసి ఒక మిల్లీ గ్రాము హెరాయిన్‌తో పాటు 88 కంటైనర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ జంటపై ఎన్‌డీపీఎన్‌ చట్టం కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. సెర్చ్‌ ఆపరేషన్‌లో పోలీస్ సిబ్బంది రూ.15 లక్షల విలువైన 30 గ్రాముల హెరాయిన్ కలిగిన రెండు ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ముగ్గురు డ్రగ్ పెడ్లర్లను అరెస్టు చేసినట్లు దిబ్రుగర్‌ ఎస్పీ ప్రతీక్‌ విజయ్‌కుమార్‌ తుబే తెలిపారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.