మంగళవారం 20 అక్టోబర్ 2020
Crime - Sep 25, 2020 , 11:21:39

వేర్వేరు కులాలు కావడం వల్లే హేమంత్‌ హత్య..

వేర్వేరు కులాలు కావడం వల్లే హేమంత్‌ హత్య..

హైదరాబాద్‌ : కులాలు వేరు కావడమే హేమంత్‌ హత్యకు కారణమని అతడి తల్లి ఆరోపించారు. సందీప్‌రెడ్డి, రాకేశ్‌రెడ్డి, రంజిత్‌రెడ్డి, యుగేందర్‌రెడ్డి, విజయేందర్‌రెడ్డే తమ కుమారుడిని హత్య చేయించారని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. ఎన్నో ఆశలు పెట్టుకొని కుమారుడిని పెంచుకున్నామనిఇంత దారుణానికి ఒడిగడతారని అనుకోలేదని ఆవేదన వ్యక్త చేశారు. పలుమార్లు ఇంటికి సైతం వచ్చి తమను బెదిరించారని, హేళన చేసి మాట్లాడారని ఆరోపించారు. గురువారం సాయంత్రం పదిమంది ఇంట్లోకి వచ్చి జంటను కారులో అపహరించారని తెలిపారు. 

ఎనిమిదేండ్లు ప్రేమించుకున్నాం : అవంతి

చిన్ననాటి నుంచి హేమంత్‌ నేను ఒకే ప్రాంతంలో పెరిగాం. ఎనిమిదేండ్ల నుంచి ప్రేమించుకున్నాం. నాలుగు నెలల క్రితం వివాహం చేసుకున్నాం. మా ఇంట్లో వివాహం ఇష్టం లేకపోవడంతో గచ్చిబౌలిలో ఉంటున్నాం. పలుమార్లు బెదిరించడంతో ఇంట్లో నుంచి కూడా బయటకు రాలేదు. హేమంత్‌ను నన్ను మా బంధువులే బలవంతంగా లాక్కెళ్లారు. బావ, వదినలు, మావయ్యలే ఈ హత్య చేయించారు. పెళ్లిముందు మా ప్రేమ విషయం తెలిసి 7 నెలలు నన్ను ఇంటికే పరిమితం చేశారు. పెద్దవారు మాట్లాడుతున్నారని అనుకున్నా కానీ ఇంతలో దారుణం చేస్తారని ఊహించలేదు’ అని హేమంత్‌ భార్య అవంతి కంటతడి పెట్టారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo