మంగళవారం 26 జనవరి 2021
Crime - Oct 15, 2020 , 15:50:58

పెన్‌ప‌హాడ్ పీఎస్ ప‌రిధిలో భారీగా గంజాయి ప‌ట్టివేత‌

పెన్‌ప‌హాడ్ పీఎస్ ప‌రిధిలో భారీగా గంజాయి ప‌ట్టివేత‌

సూర్యాపేట : జిల్లాలోని పెన్‌ప‌హాడ్ పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో పోలీసులు భారీగా గంజాయిని ప‌ట్టుకున్నారు. కేసు వివ‌రాల‌ను ఎస్పీ ఆర్‌.భాస్క‌ర‌న్ వెల్ల‌డించారు. జిల్లా సీసీఎస్ పోలీసులు, పెన్‌ప‌హాడ్ పోలీసులు సంయుక్తంగా నిర్వ‌హించిన రైడ్‌లో అనంతారం అడ్డ‌రోడ్డు వ‌ద్ద అనుమానాస్ప‌దంగా తిరుగుతున్న కార్ల‌ను ఆపి త‌నిఖీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఒక కారులో 60 కేజీల గంజాయి పొట్లాలు, మ‌రొక కారులో 70 కేజీల గంజాయి పొట్లాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. న‌లుగురు వ్య‌క్తుల‌ను అదుపులోకి తీసుకోగా కారు డ్రైవ‌ర్‌తో పాటు మ‌రో వ్య‌క్తి త‌ప్పించుకు పారిపోయారు.

నిందితులను అజ్మీరా రమేష్(మహముద్దాపురం గ్రామం), నూనావత్ విజయ్(జలమలకుంట తండా), అంగోతు నాగు(మెగ్యా తండా), భ్యుక్యా వాసు(మహముదాపురం గ్రామం), బానోతు విజయ్(సీతారాం తండా), మక్కా గణేష్(మెగ్యా తండా)గా గుర్తించారు. నూనావ‌త్ విజ‌య్‌, మ‌క్కా గ‌ణేష్ అనే ఇద్ద‌రు ప‌రారీలో ఉన్నారు. గంజాయిని వైజాగ్ నుంచి తెచ్చి హైద‌రాబాద్‌, మ‌హారాష్ర్ట‌లో అమ్మేందుకు వెళ్తున్న‌ట్లుగా స‌మాచారం. గంజాయి ర‌వాణాను బ‌హిర్గ‌తం చేసిన సీసీఎస్ ఇన్‌స్పెక్ట‌ర్ నిరంజ‌న్‌, ఎస్ఐ రంజిత్‌, సీసీఎస్ సిబ్బంది కృష్ణ‌, న‌ర్సింహారావు, ర‌మేష్‌, దుర్గాప్ర‌సాద్‌, గురుస్వామి, శ్రీ‌ను, పోలీస్ స్టేష‌న్ సిబ్బంది క‌న‌క‌ర‌త్నం, జాఫ‌ర్ అలీ కు ఎస్పీ అభినంద‌న‌లు తెలిపారు.


logo