బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Aug 21, 2020 , 15:42:38

కృష్ణా జిల్లాలో భారీగా మద్యం పట్టివేత

కృష్ణా జిల్లాలో భారీగా మద్యం పట్టివేత

కృష్ణా : కృష్ణా జిల్లాలో ఓ కారులో నుంచి 2,350 మద్యం బాటిళ్లను శుక్రవారం ఏపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. తెలంగాణ రాష్ర్టం ఖమ్మం జిల్లాలోని మధిరా నుంచి కారులో 2,350 మద్యం సీసాలను ఏపీలోని కృష్ణా జిల్లా, విజయవాడకు అక్రమంగా రవాణా చేస్తుండగా నందిగామ వద్ద పోలీసులు తనిఖీ చేసి స్వాధీనం చేసుకున్నారు. 

ఓ కారును అనుమానం వేసి తనిఖీలు చేయగా డిక్కీ, వెనుక సీటులో మొత్తం కారు నిండా మద్యం కాటన్లు ఉన్నాయని నందిగామ పోలీస్‌ అధికారి తెలిపారు. మద్యం తరలిస్తున్న వారిలో ఒకరిని అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మద్యం సీసాలను సీజ్‌ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo