మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Crime - Jul 03, 2020 , 17:47:24

ఖమ్మం జిల్లాలో భారీగా పట్టుబడ్డ గంజాయి

ఖమ్మం జిల్లాలో భారీగా పట్టుబడ్డ గంజాయి

ఖమ్మం : పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్న సంఘటన ఖమ్మం జిల్లా కేంద్రంలో చేటు సుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గంజాయి తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో జిల్లా పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ ఆదేశాల మేరకు..టాస్క్ ఫోర్స్ ఏసీపీ వెంకట్రావు ఆధ్వర్యంలో తమ సిబ్బందితో కలిసి పట్టణంలో తనిఖీలు చేపట్టారు. శ్రీనగర్ కాలనీలో నివాసం వుండే రవీంద్ర నాయక్ కు (మరిపెడ బంగ్లాకు చెందిన  వ్యక్తి) సంబంధించిన ట్రాక్టర్ ను అపార్ట్ మెంట్ సమీపంలో పార్కింగ్ చేయడంతో పోలీసులు సోదా చేశారు.

ఈ తనిఖీల్లో సుమారు రూ. 44 లక్షల విలువ చేసే 440 కేజీల నిషేధిత గంజాయిని ట్రాక్టర్ ట్రాక్ కింది భాగంలో నిల్వ చేసినట్లు గుర్తించి సీజ్ చేసినట్లు ఏసీపీలు వెంకట్రావు, వెంకటరెడ్డి మీడియాకు వివరాలు వెల్లడించారు.  అక్రమార్జనే ధ్యేయంగా కొంత కాలంగా మహబూబాబాద్ జిల్లా ఇస్లావత్ తండాకు చెందిన ఇస్లావత్ శంకర్ అనే నిందుతుడు గంజాయిని ఒడిషా రాష్ట్రం నుంచి ఖమ్మం జిల్లా మీదుగా మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని తెలిపారు. పరారీలో నిందితుల కోసం పోలీస్ బృందాలు వెతుకుతున్నట్లు పేర్కొన్నారు.


logo