శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Crime - Jan 23, 2021 , 16:09:47

ఇసుకను వేడిచేస్తే బంగారం.. రూ.50 లక్షలమేర మోసం

ఇసుకను వేడిచేస్తే బంగారం.. రూ.50 లక్షలమేర మోసం

ముంబై: ఇసుకను వేడి చేస్తే బంగారం అవుతుందంటూ ఒక జ్యుయలరీ షాపు యజమానిని ఓ వ్యక్తి రూ.50 లక్షల మేర మోసం చేశాడు. మహారాష్ట్రలోని పూణేలో ఈ ఘటన జరిగింది. హదాస్‌పూర్‌లోని ఒక నగల షాపునకు ఏడాది కిందట ఓ వ్యక్తి వచ్చాడు. యజమానితో పరిచయం పెంచుకుని తరచుగా అక్కడకు వచ్చేవాడు. యజమాని ఇంటికి పాలు, పాల ఉత్పత్తులు సరఫరా చేస్తూ కుటుంబ సభ్యులతో కూడా స్నేహంగా మెలిగేవాడు. 

కాగా, ఒక రోజు జ్యుయలరీ షాపు యజమాని వద్దకు వచ్చిన అతడు తాను బెంగాల్‌ నుంచి మ్యాజిక్‌ ఇసుకను తెచ్చినట్లు చెప్పాడు. ఆ ఇసుకను వేడి చేస్తే బంగారం అవుతుందని నమ్మించాడు. నిజమని నమ్మిన జ్యుయలరీ షాపు యజమాని రూ.30 లక్షల నగదు, రూ.20 లక్షల విలువైన బంగారాన్ని అతడికి ఇచ్చి నాలుగు కేజీల ఇసుక బస్తాను పొందాడు.

అనంతరం జ్యుయలరీ షాపు యజమాని దానిని వేడి చేయగా బంగారంగా మారకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు. దీంతో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ‘మ్యాజిక్‌ శాండ్‌’ పేరుతో మోసగించిన వ్యక్తిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo