బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Jul 17, 2020 , 14:19:11

కొడుకు మరణవార్త విని.. ప్రాణాలు వదిలిన తండ్రి

కొడుకు మరణవార్త విని.. ప్రాణాలు వదిలిన తండ్రి

నాగర్‌ కర్నూల్‌ : కొడుకు మరణ వార్త విన్న తండ్రి ప్రాణాలు వదిలిన ఘటన నాగర్‌ కర్నూలు జిల్లా లింగాల మండలం సూరాపురంలో చోటుచేసుకుంది.  సూరాపురానికి చెందిన లక్ష్మీనారాయణ ఇటీవల కరోనా కారణంగా మృతి చెందాడు.  అయితే అతని మరణ వార్తను తండ్రికి తెలియకుండా కుటుంబ సభ్యులు దాచిపెట్టారు. కానీ ఇంటి చుట్టుపక్కల వారు, బంధువుల ద్వారా బుధవారం రాత్రి విషయం తెలుసుకున్న ఆ వృద్ధ తండ్రి మనోవేదనకు గురయ్యాడు.

కొడుకు మరణవార్త విని తట్టుకోలేక గురువారం గుండెపోటుతో కుప్పకూలాడు. బంధువులు దవాఖానకు తరలించేలోగా ప్రాణాలు వదిలాడు. రెండు రోజుల వ్యవధిలో తండ్రీ, కొడుకులిద్దరూ మరణించటంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్లోడ్ చేసుకోండి.


logo