ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Sep 08, 2020 , 07:16:35

కేరళలో క్వారంటైన్‌ పేరిట నర్సుపై లైంగిక దాడి

కేరళలో క్వారంటైన్‌ పేరిట నర్సుపై లైంగిక దాడి

తిరువనంతపురం : క్వారంటైన్‌ పేరిట నర్సుపై ఆరోగ్యాధికారి లైంగిక దాడి చేసిన ఘటన కేరళలో వెలుగు చూసింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంగతి బయటపడింది. 19 ఏండ్ల యువతిపై కరోనా అంబులెన్స్‌ డ్రైవర్‌ లైంగిక దాడి చేసిన మరునాడే ఈ ఘటన వెలుగు చూసింది. దీంతో ఆ ఆరోగ్యాధికారిపై ఐపీసీలోని 376 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి ఆయనను పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. మల్లపురంలో హోం నర్సుగా పని చేస్తున్న మహిళ (44)ను సంబంధిత ఆరోగ్యాధికారి క్వారంటైన్‌కు వెళ్లాలని సూచించాడు. ఆమె యాంటిజెన్‌ పరీక్ష చేయించుకోగా, నెగెటివ్‌ అని తేలింది. సదరు టెస్ట్‌ సర్టిఫికెట్‌ కోసం ఇంటికి రమ్మని పిలిచి, ఈ నెల 3న ఆమెపై లైంగికదాడి చేసి మరుసటి రోజు వదిలేశాడు. మరోవైపు ఈ ఘటనపై మహిళాకమిషన్‌ కేసు నమోదు చేసింది. సదరు ఆరోగ్యాధికారిపై క్రమశిక్షణాచర్య తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శికి సూచించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo