మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Sep 10, 2020 , 18:56:20

గన్‌ మిస్‌ఫైర్‌.. బుల్లెట్‌ దిగి కానిస్టేబుల్‌ మృతి

గన్‌ మిస్‌ఫైర్‌.. బుల్లెట్‌ దిగి కానిస్టేబుల్‌ మృతి

కర్నూల్‌ : గన్‌ మిస్‌ఫైర్‌ అయి విధి నిర్వహణలో ఉన్న పోలీస్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి చెందాడు. కర్నూలు  జిల్లాలో గురువారం ఈ ఘటన జరిగింది. ఏపీ ప్రత్యేక పోలీస్‌ రెండో పటాలంలో కానిస్టేబుల్‌గా సాల్మన్‌ రాజు విధులు నిర్వహిస్తున్నాడు. గురువారం ఉదయం అతడి తుపాకీ మిస్‌ ఫైర్‌ అయ్యింది. పెద్ద శబ్దం రావడంతో సహోద్యోగులు అక్కడికి వెళ్లగా సాల్మన్‌ రాజు రక్తపు మడుగులో కిందపడి కనిపించాడు. శరీరంలో బుల్లెట్‌ గాయాన్ని గుర్తించిన వారు అతడిని హుటాహుటిన ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గన్‌ మిస్‌ఫైర్‌ అయ్యిందా..! లేక ఆత్మహత్య చేసుకున్నాడా తెలియాల్సి ఉంది. కర్నూల్‌ 4వ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo