శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Sep 06, 2020 , 16:54:29

చెరువులోకి స్నానానికి వెళ్లి శవమై తేలాడు

చెరువులోకి స్నానానికి వెళ్లి శవమై తేలాడు

జయశంకర్ భూపాలపల్లి : జిల్లాలోని చిట్యాల మండల ఒడితలం గ్రామ శివారు చెరువులో ఆదివారం ఓ మృతదేహం లభ్యమైంది. మృతుడు గ్రామానికి చెందిన అలుగుల ఓదెలుగా గ్రామస్తులు గుర్తించారు. గత మూడు రోజుల క్రితం దహన సంస్కారాల్లో పాల్గొని తిరిగి ఒంటరిగా స్నానం చేస్తున్న  క్రమంలో కాలుజారి పడినట్లు తెలిపారు. బంధువులు, కుటుంబ సభ్యులు ఓదెలు ఆచూకీ కోసం వెతకగా చివరకు శవమై కనిపించడంతో మృతుడి కుటుంబ సభ్యుల రోనదనలు మిన్నంటాయి.


logo