ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Sep 06, 2020 , 18:43:08

పెళ్లి చేసుకుంటాన‌ని మైన‌ర్‌ను తీసుకెళ్లి.. మిత్రుల‌తో రేప్ చేయించాడు

పెళ్లి చేసుకుంటాన‌ని మైన‌ర్‌ను తీసుకెళ్లి.. మిత్రుల‌తో రేప్ చేయించాడు

జ‌లూర్ : ‌పెళ్లి చేసుకుంటాన‌ని మాయ‌మాట‌లు చెప్పి ఓ యువ‌కుడు మైన‌ర్‌ను తీసుకెళ్లి.. మిత్రుల‌తో రేప్ చేయించాడు. ఈ ఘ‌ట‌న రాజ‌స్థాన్ రాష్ర్టం జ‌లూర్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాలు.. జిల్లాలోని భీన్మల్ పట్టణానికి చెందిన 14 ఏండ్ల బాలిక‌ సెప్టెంబ‌ర్ 1న‌ వేరే గ్రామంలో నివ‌సిస్తున్న త‌న మామ‌య్య ఇంటికి కాలిన‌డ‌క‌న వెళుతోంది. ఈ క్ర‌మంలో న‌లుగురు యువ‌కులు కారులో వ‌చ్చి ఆమెను బ‌ల‌వంతంగా ఎక్కించుకున్నారు. కొద్ది దూరం తీసుకెళ్లి బాలిక అశ్లీల ఫొటోలు తీశారు.

త‌మ‌తో రాక‌పోతే ఫొటోలు వైర‌ల్ చేస్తామ‌ని బెదిరించారు. అయినా బాలిక ప్ర‌తిఘ‌టించ‌డంతో వారిలో మ‌నీశ్ అనే యువ‌కుడు బాలిక‌ను పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మించి మ‌రో బైక్‌పై ఆమెను భీన్మ‌ల్ నుంచి పాలికి తీసుకొచ్చాడు. అక్క‌డ బాలిక‌ను త‌న మేన‌త్త ఇంట్లో ఉంచి లైంగిక‌దాడికి పాల్ప‌డ్డాడు. మ‌రుస‌టి రోజు బాలిక‌ను పాలి నుంచి జలూర్‌కు తీసుకెళ్ల‌గా అక్క‌డ మ‌నీశ్ మిత్రులు జగదీశ్‌, సోమతారాం, జెత్మల్ క‌లిసి ఆమెపై గ్యాంగ్ రేప్‌కు పాల్ప‌డ్డారు. ఆ త‌రువాత జగదీశ్ కుమార్ బాలిక‌ను కారులో త‌న ఫాం హౌస్‌కు తీసుకెళ్లి ప‌లుమార్లు లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. బాలిక త‌న‌ను భీన్మ‌ల్‌లో విడిచి పెట్టాల‌ని వేడుకోగా స‌రేన‌ని వ‌దిలేశారు.

త‌రువాత పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో వారు మ‌నీశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మిగ‌తా నిందితుల కోసం వెతుకుతున్న‌ట్లు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo