శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Aug 05, 2020 , 13:51:05

ఇద్దరిని పొడిచి చంపి తానూ విషం తాగాడు

ఇద్దరిని పొడిచి చంపి తానూ విషం తాగాడు

న్యూ ఢిల్లీ : ఢిల్లీలో ఓ వ్యక్తి మొదట తన పక్కింట్లో ఉండే జంటను కత్తితో పొడిచి హత్య చేసి తరువాత తను కూడా విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దక్షిణ  ఢిల్లీలోని నరేలా ప్రాంతంలో మంగళవారం ఈ సంఘటన జరగ్గా బుధవారం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నాయీ బస్తీలో నివాసముంటున్న ముష్తాఖ్‌ అనే వ్యక్తి అతడి ఇంటి పక్కన నివాసం ఉంటున్న భార్య, భర్తను కత్తితో పొడిచి తప్పించుకున్నాడు. వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా ముష్తాఖ్‌ వేరే చోటుకు వెళ్లి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. 

అయితే ఆ వ్యక్తి ఇద్దరినీ హత్య చేయడానికి గల కారణం తెలియరాలేదు. బుధవారం తెల్లవారుజామున 2.40 గంటలకు మహిళను చంపిన తరువాత ఒక వ్యక్తి రక్తపు మరకలతో తప్పించుకున్నాడని పోలీసులకు ఫోన్‌ వచ్చిందని డీసీపీ గౌరమ శర్మ అన్నారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని, సాధ్యమైనంత వరకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని శర్మ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo