బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Aug 04, 2020 , 15:41:55

లిఫ్ట్‌ ఇచ్చి లైంగిక దాడికి పాల్పడి.. ఆభరణాలు దోచుకున్నాడు

లిఫ్ట్‌ ఇచ్చి లైంగిక దాడికి పాల్పడి.. ఆభరణాలు దోచుకున్నాడు

పూణే : మహారాష్ట్రలోని పూణే నగరంలో ఓ మహిళపై లైంగికదాడికి పాల్పడి ఆమె వద్ద నుంచి రూ.లక్ష విలువైన ఆభరణాలను ఓ 53 ఏండ్ల వ్యక్తి దోచుకున్నాడు.  వివరాలు.. పూణే నగరంలోని సోలాపూర్ హైవే ప్రాంతంలో ఫాతిమా నగర్ సమీపంలో ఉన్న బస్‌స్టాప్‌ వద్ద ఓ 45 ఏండ్ల మహిళ కల్భోర్‌కు వెళ్లాలని వేచి ఉంది. ఇదే సమయంలో అటుగా ద్విచక్రవాహనంపై వెళ్తున్న దుష్రత్‌ బాన్సోడ్‌(52) అనే వ్యక్తి ఆమెకు లిఫ్ట్‌ ఇస్తానని చెప్పి తన బైక్‌ ఎక్కించుకున్నాడు. 

అనంతరం ఆమెను దగ్గరలో నిర్మానుష్యంగా ఉన్న ఫంక్షన్‌హాల్‌లోని ఓ గదిలోకి తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతే కాకుండా ఆమె శరీరంపై ఉన్న రూ.లక్ష విలువైన ఆభరణాలను దోచుకెళ్లాడు. బాధితురాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు నిందితుడు దుష్రత్‌ను పట్టుకొని లైంగికదాడి 376, దొంగతనం 379 సెక్షన్ల కింద కేసుల నమోదు చేసినట్లు మంగళవారం మంధవా పోలీసులు పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo