గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Sep 15, 2020 , 16:37:18

హవాలా సొమ్ము రూ.3.75 కోట్లు సీజ్‌.. న‌లుగురు అరెస్ట్‌

హవాలా సొమ్ము రూ.3.75 కోట్లు సీజ్‌.. న‌లుగురు అరెస్ట్‌

హైదరాబాద్‌ : నగరంలోని బంజారాహిల్స్‌లో హవాలా రాకెట్‌ను పోలీసులు బహిర్గత పరిచారు. నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. అదేవిధంగా రూ.3.75 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు రెండు కార్లను సీజ్‌ చేశారు. ఘటన వివరాలను హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. సమాచారం మేరకు వెస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రైడ్‌ చేసి నిందితులు ఈశ్వర్‌ దిలీప్‌ సోలంకి(29), హరీష్‌ రాంభాయ్‌ పటేల్‌(35), అజిత్‌సింగ్‌(34), రాథోడ్‌ కనక్‌సింగ్‌ నటుబా(42)ను పట్టుకున్నట్లు తెలిపారు. గుజరాత్‌ నివాసులైన వీరు బంజారాహిల్స్‌లో ఉంటున్నట్లు వెల్లడించారు. విచారణలో ముంబైకి చెందిన పి. విజయ్‌ అండ్‌ కో కు పనిచేస్తున్నట్లు తెలిపారు. ఆ కంపెనీ హైదరాబాద్‌లో బ్రాంచ్‌ను కలిగిఉందన్నారు. నిందితులు నలుగురు కంపెనీ నుంచి నగదును తీసుకుని షోలాపూర్‌కు చేరవేసేందుకు రెండు కార్లలో బయలుదేరారు. సమాచారం మేరకు పోలీసులు రైడ్‌ చేసి పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదు, సీజ్‌ చేసిన కార్లను తదుపరి విచారణ నిమిత్తం ఇన్‌కం ట్యాక్స్‌ అధికారులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.logo