గురువారం 26 నవంబర్ 2020
Crime - Oct 28, 2020 , 23:01:11

నగరంలో భారీగా హవాలా డబ్బు పట్టివేత

నగరంలో భారీగా హవాలా డబ్బు పట్టివేత

హైదరాబాద్‌... హవాలా డబ్బును పోలీసులు భారీగా పట్టుకున్నారు. నగరంలోని ఉత్తర మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రూ. 50 లక్షల హవాలా నగదును పట్టుకున్నారు. అవినాశ్‌ గౌడ్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎల్బీ స్టేడియం వద్ద అవినాశ్‌ గౌడ్‌ను పోలీసులు పట్టుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. అవినాశ్‌ హైదరాబాద్‌, కొయంబత్తూరులో స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నట్లుగా సమాచారం. శ్రీకాళహస్తీలోని రమేశ్‌ అనే వ్యక్తి నుంచి అవినాశ్‌ వాహలా ద్వారా రూ. 50 లక్షలు తీసుకున్నట్లుగా సమాచారం. డబ్బులకు లెక్క చూపించకపోవడంతో పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నగదును ఆదాయపన్నుశాఖ అధికారులకు అప్పగించారు.