గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Aug 20, 2020 , 15:20:15

భారీ వర్షాలకు పక్కకు ఒరిగిన నాలుగంతస్తుల బిల్డింగ్

భారీ వర్షాలకు పక్కకు ఒరిగిన నాలుగంతస్తుల బిల్డింగ్

గురుగ్రామ్: హర్యానాలో కురుస్తున్న భారీ వర్షాలకు ఒక బిల్డింగ్ పక్కకు ఒరిగింది. గురుగ్రామ్ సెక్టార్ -46‌లోని నాలుగు అంతస్తుల భవనం ఒకవైపునకు ఒంగిపోయింది. దీంతో అందులో నివాసం ఉంటున్న వారు భయాందోళన చెందారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ భవనంలో ఉంటున్న వారిని ఖాళీ చేయించారు. భారీ వర్షాల కారణంగా బిల్డింగ్ ఒరిగినట్లు అధికారులు తెలిపారు.

కాగా, ఆ ప్రాంతంలో భారీగా వర్షం కురుస్తుండటంతో రోడ్లు జలమయమయ్యాయి. మరోవైపు భారీ వర్షాలకు గురుగ్రామ్‌లోని ఐఎఫ్ఎఫ్‌సీవో చౌక్ వద్ద రోడ్డు గురువారం ఉదయం కొట్టుకుపోయింది. దేశ రాజధాని పరిధిలోని ఈ ప్రాంతంలో చాలా రహదారులు దెబ్బతిన్నాయి. గురువారం భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ముందుగానే పేర్కొన్నది.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo