సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Aug 03, 2020 , 17:29:53

రూ.3.75 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్ల పట్టివేత

రూ.3.75 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్ల పట్టివేత

ఖమ్మం : జిల్లాలోని నేలకొండపల్లి మండలం చేరువుమాదరం గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన నిషేధిత గుట్కా ప్యాకెట్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలోని ఒక ఇంట్లో గుట్కా నిల్వలు ఉన్నట్లు సమాచారం రావడంతో ఖమ్మం టాస్క్ ఫోర్స్ డీసీపీ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది దాడి చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.3.75 లక్షలు ఉంటుందన్నారు. ఎవరైనా నిషేధిత గుట్కా ప్యాకెట్లు అమ్మితే కఠిన చర్యలు తీసుకుమాంటామని హెచ్చరించారు.


logo