శనివారం 05 డిసెంబర్ 2020
Crime - Oct 20, 2020 , 15:01:38

రూ.4 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్ల పట్టివేత

రూ.4 లక్షల విలువ చేసే గుట్కా ప్యాకెట్ల పట్టివేత

సంగారెడ్డి : అక్రమంగా గుట్కా తరలిస్తున్న నిందితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. గుట్కా తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో కర్ణాటక, తెలంగాణ సరిహద్దు వద్ద పోలీసులు గుట్కా సంచులు పట్టుకున్నారు. న్యాల్‌కల్ మండల పరిధిలోని గణేష్ పూర్ వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. బీదర్ నుంచి అక్రమంగా రూ. 4 లక్షల విలువ చేసే నిషేధిత గుట్కా సంచులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.