ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Aug 04, 2020 , 18:29:50

విద్యార్థిని నగ్న చిత్రాల కేసులో మరో ట్విస్ట్

  విద్యార్థిని నగ్న చిత్రాల కేసులో మరో ట్విస్ట్

అమరావతి: గుంటూరు లో బీటెక్ విద్యార్థిని కేసులో మరో ట్విస్ట్ భయటపడింది. విద్యార్థిని నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసిన కేసులో పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నగ్న చిత్రాలను తీసిన వరుణ్ వాటిని పోర్న్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసిన కౌశిక్ లను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పుడు వాటిని ఇన్స్టాగ్రామ్ లో "మై నేమ్ ఈజ్ 420 " అనే అకౌంట్ లో అప్ లోడ్ చేసిన వ్యక్తిని సైతం అరెస్ట్ చేసారు.

కాగా పోలీసుల విచారణలో నిందితుడు ఆ వీడియోలను మరో నలుగురికి పంపినట్టు తెలిపాడు. పోలీసులు వారిలో ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకోగా..మరో ముగ్గురికోసం గాలిస్తున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న నిందితుడు సైతం విద్యార్థిని కాలేజీకి చెందిన వాడేనని తెలిసింది. నిందితులు పలు సంధర్భాల్లో విద్యార్థిని నుండి డబ్బులు డిమాండ్ చేసారని, వేధింపులకు గురి చేసారని పోలీసుల విచారణలో వెల్లడైంది. logo