సోమవారం 13 జూలై 2020
Crime - May 26, 2020 , 14:48:33

పోలీసు అకాడమీలో గన్‌ మిస్‌ ఫైర్‌.. ఆర్‌ఐకి గాయాలు

పోలీసు అకాడమీలో గన్‌ మిస్‌ ఫైర్‌.. ఆర్‌ఐకి గాయాలు

హైదరాబాద్‌ : తెలంగాణ పోలీస్‌ అకాడమీ ట్రైనింగ్‌ సెంటర్‌లో గన్‌ మిస్‌ ఫైర్‌ అయింది. రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ వినోద్‌కు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆయనను గచ్చిబౌలి కాంటినెంటర్‌ ఆస్పత్రికి తరలించారు. అయితే ట్రైనీ మహిళా ఎస్‌ఐ ప్రాక్టీసులో భాగంగా ఫైర్‌ చేస్తుండగా.. వినోద్‌కు బుల్లెట్‌ తగిలినట్లు తెలుస్తోంది. వినోద్‌ 1996 బ్యాచ్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్‌‌. ప్రస్తుతం వినోద్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.


logo