శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Aug 28, 2020 , 09:59:12

హైదర్‌షాకోట్‌‌లో‌ కాల్పుల క‌ల‌క‌లం.. మాజీ జ‌వాన్ అరెస్ట్‌

హైదర్‌షాకోట్‌‌లో‌ కాల్పుల క‌ల‌క‌లం.. మాజీ జ‌వాన్ అరెస్ట్‌

హైదరాబాద్: నగరంలోని నార్సింగి హైదర్‌షాకోట్‌లో కాల్పుల కలకలం రేగింది. గణేశ్‌ నిమజ్జనం సంద‌ర్భంగా ఓ ఆర్మీ మాజీ జవాన్‌ కాల్పులు జరిపాడు. హైద‌ర్‌షాకోట్‌లోని శివం హైలెట్స్ అపార్ట్‌మెంట్‌లో ఆర్మీ మాజీ జ‌వాన్ నాగ మ‌ల్లేష్ ఉంటున్నారు. గ‌ణేశుని నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా ఇంటి స‌మీపంలో ఉన్న హైరిచ్ ఇంటర్నెట్‌ సిబ్బంది పార్టీ చేసుకున్నారు.  

అయితే ఇంటర్నెట్ సిబ్బందిని ఆర్మీ మాజీ జవాన్ మ‌ల్లేష్‌ పలుమార్లు వారించినా పట్టించుకోలేదు. దీంతో రివాల్వర్‌తో గాల్లోకి కాల్పులు జరిపాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని నాగ మ‌ల్లేష్‌ను అరెస్టు చేశారు. అత‌ని వ‌ద్ద‌ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. జ‌వాన్ రెండు రౌండ్లు కాల్పులు జరపడంతో.. ఒకటి గాల్లోకి వెళ్లగా, మరకొటి పక్కనే ఉన్న ఓ వ్యక్తి చెవి పక్క నుంచి దూసుకెళ్లింది.  ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   


logo