సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Sep 05, 2020 , 07:16:49

విషం తాగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

విషం తాగి ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య

దాహోద్ : .. ఆ కుటుంబానికి ఏం కష్టం వచ్చిందో తెలియదు కాని అందరూ సామూహికంగా బలవన్మరణానికి పాల్పడ్డారు. సూసైడ్‌ నోట్ రాసి విషయం తాగి తనువు చాలించారు.  ఈ విషాద ఘటన గుజరాత్‌లోని దాహోద్‌లో జిల్లాలో శుక్రవారం రాత్రి జరిగింది. సైఫీ సబ్బర్‌భాయ్ దుధియవాలా అన్యే భార్య ముగ్గురు కుమార్తెలతో కలిసి దాహోద్‌లో నివాసం ఉంటున్నాడు. రాత్రి అందరూ విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రాథమిక దర్యాప్తులో ఆర్థిక ఇబ్బందుల కారణంగానే కుటుంబం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి కారణాలు తెలుసుకునేందుకు మృతుల బ్యాంకు ఖాతా వివరాలు పరిశీలిస్తున్నామని డీఎస్పీ సోలంకి తెలిపారు. ఇంట్లో సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నామని, ఇందులో ఆత్మహత్యకు గల ప్రత్యేక కారణాలేవీ ప్రస్తావించబడలేదని ఆయన పేర్కొన్నారు. కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నామని వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo