శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Aug 26, 2020 , 16:51:06

మైనర్‌పై కిరాణా షాపు యజమాని లైంగిక దాడి

మైనర్‌పై కిరాణా షాపు యజమాని లైంగిక దాడి

హిసార్‌ (హర్యానా) : 14 ఏండ్ల మైనర్‌ బాలికపై కిరాణా షాపు యజమాని లైంగిక దాడికి పాల్పడిన ఘటన హర్యానా రాష్ర్టం హిసార్‌ జిల్లాలోని ఉక్లానాలో సోమవారం చోటు చేసుకుంది. 

వివరాలు.. ఉక్లానాలో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న ఓ 35 ఏండ్ల వ్యక్తి తన షాపు ఎదురుగా నివసిస్తున్న 14 ఏండ్ల మైనర్‌ బాలికపై కన్నేశాడు. సోమవారం బాలిక తల్లిదండ్రులు వ్యక్తిగత పని నిమిత్తం బయటికెళ్లగా బాలిక ఒక్కతే ఇంట్లో ఉంది. ఇదే అదునుగా భావించిన షాప్‌ నిర్వాహకుడు.. తన ఇంటి తలుపులు మూసివేయడానికని బాలికను పిలిచి ఎత్తుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. 

మరుసటి రోజు బాలిక తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో తల్లిదండ్రులు గమనించి దవాఖానకు తరలించగా లైంగిక దాడి జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. ఎలా జరిగిందని బాలికను అడగ్గా.. జరిగిన విషయాన్ని ఆమె తల్లికి వివరించడంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo