ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jul 12, 2020 , 12:25:29

19 ఏళ్ల యువ‌తితో వృద్ధుడు జంప్

19 ఏళ్ల యువ‌తితో వృద్ధుడు జంప్

అహ్మ‌దాబాద్ : ఓ వృద్ధుడు.. 19 ఏళ్ల యువ‌తిని తీసుకుని లేచిపోయాడు. యువ‌తి మేజ‌ర్ కావ‌డంతో.. పోలీసులు కేసు న‌మోదు చేయలేదు. దీంతో ఆమె త‌ల్లిదండ్రులు కోర్టును ఆశ్ర‌యించారు. జులై 13వ తేదీన కోర్టులో యువ‌తిని హాజ‌రుప‌ర‌చాల‌ని పోలీసుల‌కు గుజ‌రాత్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

ఈ ఏడాది జూన్ 2వ తేదీన ఓ 19 ఏళ్ల యువ‌తి అదృశ్య‌మైంది. యువ‌తికి ఇంటికి తిరిగి రాక‌పోవ‌డంతో.. బాధితురాలి త‌ల్లిదండ్రులు మూడు రోజుల త‌ర్వాత పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పొరుగింటి వృద్ధుడు షోవంజీ ఠాకూర్ తమ కుమార్తెను తీసుకెళ్లాడ‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే యువ‌తి మేజ‌ర్ కావ‌డంతో.. పోలీసులు కేసు న‌మోదు చేయ‌లేదు. దీంతో ఆమె త‌ల్లిదండ్రులు గుజ‌రాత్ హైకోర్టును ఆశ్ర‌యించారు. త‌మ కుమార్తెను ఓ వృద్ధుడు తీసుకెళ్లాడ‌ని, పోలీసులు కేసు న‌మోదు చేయ‌డం లేద‌ని పిటిష‌న్ లో పేర్కొన్నారు పేరెంట్స్. జూన్ 22న పిటిష‌న్ ను విచారించిన కోర్టు.. 29వ తేదీ లోగా యువ‌తి ఆచూకీ క‌నుగొని హాజ‌రు ప‌ర‌చాల‌ని ఆదేశించింది. మ‌ళ్లీ ఇటీవ‌లే పిటిష‌న్ విచార‌ణ‌కు వ‌చ్చింది. యువ‌తి ఆచూకీ కోసం గాలిస్తున్నామ‌ని పోలీసులు కోర్టుకు తెలిపారు. జులై 13 లోపు ఆమెను కోర్టులో హాజ‌రుప‌ర‌చాల‌ని పోలీసులను కోర్టు ఆదేశించింది. 

అయితే వృద్ధుడి పెద్ద కుమార్తెకు ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. అంత‌టి వ‌య‌సున్న ఆయ‌న‌.. అమ్మాయితో లేచిపోవ‌డం స‌రికాద‌ని పిటిష‌న‌ర్ అన్నారు. ప్ర‌స్తుతం బాధిత యువ‌తి డేంజ‌ర్ జోన్ లో ఉంద‌న్నారు.


logo