బుధవారం 12 ఆగస్టు 2020
Crime - Jul 02, 2020 , 19:56:25

వాగులో పడి తాతామనవడు మృతి

వాగులో పడి తాతామనవడు మృతి

రాజన్న సిరిసిల్ల : జిల్లాలోని గంభీరావుపేటలో విషాద సంఘటన చోటుచేసుకుంది. మానేరు వాగులో పడి తాతామనవడు ఇద్దరూ మృతిచెందారు. వ్యవసాయ మోటార్‌ వద్దకు వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మృతులను మల్లయ్య(55), నందన్‌(9)గా గుర్తించారు. తాతామనవల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


logo