e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home క్రైమ్‌ టీచ‌ర్‌కు అసభ్య సందేశాలు పంపిన ప్రిన్సిపాల్ అరెస్ట్‌

టీచ‌ర్‌కు అసభ్య సందేశాలు పంపిన ప్రిన్సిపాల్ అరెస్ట్‌

టీచ‌ర్‌కు అసభ్య సందేశాలు పంపిన ప్రిన్సిపాల్ అరెస్ట్‌

జైపూర్‌: ఉపాధ్యాయురాలికి అస‌భ్య వాట్సాప్ సందేశాలు పంపిన ప్రిన్సిపాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజ‌స్థాన్‌లోని భినైలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఎక‌ల్‌సింఘాలోని ప్ర‌భుత్వ‌ సీనియ‌ర్ సెంక‌డ‌రీ స్కూలు ప్రిన్సిపాల్ దేవేంద్ర కుమార్ సంఖ‌ల జూన్ 4న ఒక టీచ‌ర్‌ను ప్రైమ‌రీ స్కూల్‌కు బ‌దిలీ చేసి బాధిత ఉపాధ్యాయురాలిని ఈ స్కూలుకు ర‌ప్పించాడు. ఏడు నెల‌ల గ‌ర్భ‌వ‌తి అయిన ఆమెను విధుల్లో చేరాలంటూ నోటీసులు జారీ చేశారు. స్కూలుకు వెళ్లిన ఆమె ప‌ట్ల ప్రిన్సిపాల్ అవ‌మాన‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. అనంత‌రం ఆ టీచ‌ర్‌కు వాట్సాప్‌లో అస‌భ్య‌క‌ర సందేశాలు పంపాడు. దీంతో బాధిత ఉపాధ్యాయురాలు భినై పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ప్రిన్సిపాల్ దేవేంద్ర కుమార్‌ను స్టేష‌న్‌కు రప్పించారు. అక్క‌డ బాధితురాలిని చూసిన ఆయ‌న పోలీసుల ముందే ఆమెను బెదిరించాడు. దీంతో పోలీసులు ప్రిన్సిపాల్‌పై ప‌లు సెక్ష‌న్ల కింద‌ కేసు న‌మోదు చేసి అత‌డ్ని అరెస్ట్ చేశారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
టీచ‌ర్‌కు అసభ్య సందేశాలు పంపిన ప్రిన్సిపాల్ అరెస్ట్‌
టీచ‌ర్‌కు అసభ్య సందేశాలు పంపిన ప్రిన్సిపాల్ అరెస్ట్‌
టీచ‌ర్‌కు అసభ్య సందేశాలు పంపిన ప్రిన్సిపాల్ అరెస్ట్‌

ట్రెండింగ్‌

Advertisement