శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Aug 25, 2020 , 19:14:01

సెల్ ఫోన్ లో బంగారం స్మగ్లింగ్...ఢిల్లీ ఎయిర్ పోర్టులో పట్టివేత

సెల్ ఫోన్ లో బంగారం స్మగ్లింగ్...ఢిల్లీ ఎయిర్ పోర్టులో పట్టివేత

ఢిల్లీ : ఢిల్లీ ఎయిర్ పోర్టులో తాజాగా బంగారం పట్టుబడిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దుబాయి నుంచి బంగారం స్మగ్లింగ్ చేయడానికి వారు పాత సెల్ ఫోన్ వాడారు. అది కూడా ఓల్డ్ మోడల్ కావడంతో కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. సెల్ ఫోన్లో బ్యాటరీ తీసేసి ఆ ప్లేస్ లో అదే సైజు బంగారం బిస్కెట్ అమర్చారు. మామూలుగా అయితే ఎవరికీ అనుమానం రాదు. కానీ ఎయిర్ పోర్టుకి వచ్చే ప్రయాణికుల్ని పూర్తిస్థాయిలో చెక్ చేసే కస్టమ్స్ అధికారుల దృష్టి ఈసెల్ ఫోన్ పై పడింది. దీంతో ఫోన్ లో అక్రమంగా తరలిస్తున్న బంగారం దొరికిపోయింది. 


logo