ఐటీ కారిడార్‌లోని మైండ్‌స్పేస్ ఫ్లైఓవర్‌పై ఏర్పాటు చేసిన పూల మొక్కలతో ఫ్లైఓవర్ మరింత అందంగా ముస్తాబైంది. గతంలో మాదిరిగా పూల మొక్కలకు వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని పట్టే పద్ధతి కాకుండా నూతనంగా డ్రిప్ సిస్టమ్ ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. ఈవోక్ టెక్నాలజీస్ సంస్థ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్)లో భాగంగా సరికొత్తగా అందమైన ఫైబర్ పాట్స్ (తెల్లని రంగులో ఉన్న ఫైబర్ పాట్స్)లో పూల మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను తీసుకుంది. పర్యావరణ హితంగా రూపొందించిన ఈ ఫైబర్ పాట్స్ కాలుష్య రహితంగా, ఎండా, వానలను తట్టుకోవడంతో పాటు అగ్నికి అహుతి కాకుండా ప్రమాదాలు చోటు చేసుకున్న పగులకుండా దృఢంగా ఉంటుంది. ప్రతి రోజు పాట్స్‌ను శుభ్రం చేయడంతో పాటు మొక్కలను సైతం ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు.
మైండ్‌స్పేస్ ఫ్లైఓవర్‌పై మొక్కలకు నీరందించేందుకు ఫ్లైఓవర్ కింద నీటి నిల్వ కోసం ప్రత్యేకంగా 20వేల కెపాసిటీ గల నీటి సంపును ఏర్పాటు చేశారు. సంపులో ఎస్టీపీలో ఫిల్టర్ చేసిన నీటిని ట్యాంకర్ల ద్వారా తీసుకువచ్చి నింపుతున్నారు. సంపులో 3హెచ్‌పీ మోటర్‌ను ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 1.25 ఇంచుల పైపు లైన్ ద్వారా ఫ్లైఓవర్ డివైడర్ పైకి వేశారు. ఈ పైపులైన్ ద్వారా డివైడర్‌పై ఉంచిన పాట్స్కి పైపులైన్ నుంచి 0.5 సైజ్ పైపుతో నీరు అందేలా ఏర్పాటు చేశారు. ఈ మొత్తం సిస్టమ్ ద్వారా ప్రతి రెండు రోజులకొకసారి నీటి సరఫరాను చేస్తున్నారు. పాత పద్ధ్దతిలో నీటిని అందించడం ద్వారా పాట్తో పాటు అందులోని మొక్కలు కదులుతుండడంతో మొక్క చనిపోయే ప్రమాదముంది. కానీ ఈ పద్ధ్దతి ద్వారా నీటిని సరఫరా చేయడంతో నీటి వృథాను అరికట్టడంతో పాటు మొక్కలకు సైతం ఎలాంటి ఇబ్బంది కలుగదు.
మైండ్‌స్పేస్ ఫ్లైఓవర్‌పై ఈవోక్ టెక్నాలజీస్ సీఎస్ఆర్ కింద ఏర్పాటు చేసిన మొక్కలు ఫ్లైఓవర్‌కు మరింత అందాన్నిస్తున్నాయి. ఖరీదైన 222 ఫైబర్ పాట్స్ని ఏర్పాటు చేసింది. మొక్కతో కలిపి ఒక్కొక్క పాట్ ఖరీదు రూ.4వేలుగా ఉంటుంది.
మైండ్‌స్పేస్ ఫ్లైఓవర్‌పై ఫైబర్ పాట్స్‌లో ఏర్పాటు చేసిన మొక్కల సంరక్షణలో భాగంగా డ్రిప్ సిస్టమ్ ఎంతో కష్టపడి రూపొందించాము. మన్నికతో పాటు ఆకర్షణీయంగా ఉండేందుకు ఖరీదైన తెలుపు రంగు ఫైబర్ పాట్స్ని ఏర్పాటు చేశాము. మరిన్ని చోట్ల ఈ పద్ధ్దతిలో మొక్కల పెంపకానికి జీహెచ్ఎంసీతో చర్యలు జరుపుతున్నాము. మైండ్‌స్పేస్ ఫ్లైఓవర్‌పై ఏర్పాటు చేసిన ఈ విధానం సంతృప్తినిచ్చింది. మరో 7 సంవత్సరాల వరకు వీటి సంరక్షణ బాధ్యత మేమే తీసుకున్నాము. – హరీశ్ డాగా, ఈవోక్ టెక్నాలజీస్