శుక్రవారం 23 అక్టోబర్ 2020
Crime - Oct 01, 2020 , 20:47:43

ఏడుగురి పురీషనాళంలో దాచిన బంగారం ముద్దలు స్వాధీనం

ఏడుగురి పురీషనాళంలో దాచిన బంగారం ముద్దలు స్వాధీనం

చెన్నై: ఏడుగురు విమాన ప్రయాణికులు తమ పురీషనాళంలో దాచిన బంగారం ముద్దలను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడులోని చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. దుబాయ్ నుంచి చెన్నైకి బుధవారం వచ్చిన ఏడుగురు విమాన ప్రయాణికుల కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో ఎగ్జిట్ గేట్ వద్ద కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. పరికరాలతో వారిని తనిఖీ చేయగా పురీష‌నాళంలో బంగారం పేస్ట్‌ను 9 ఉండలుగా దాచిన విషయాన్ని గుర్తించారు. ఈ బంగారం 1.39 కేజీలు ఉందని, మార్కెట్‌లో దీని విలువ రూ.72.51 లక్షలని కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఏడుగురిని అరెస్ట్ చేసి కస్టమ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo