శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Aug 22, 2020 , 18:57:11

కార్డుబోర్డు షీట్స్‌లో భారీగా బంగారం అక్ర‌మ ర‌వాణా

కార్డుబోర్డు షీట్స్‌లో భారీగా బంగారం అక్ర‌మ ర‌వాణా

చెన్నై : విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు చెన్నై ఎయిర్ క‌స్ట‌మ్స్ అధికారులు నేడు 1.45 కేజీల బంగారాన్ని ప‌ట్టుకున్నారు. ప్ర‌యాణికుడు దుబాయ్ నుంచి చెన్నై విమానాశ్ర‌యానికి ముందే చేరుకున్నాడు. కాగా అత‌ని వ‌స్తువులు మాత్రం బ్యాగేజీ టెర్మిన‌ల్‌కు త‌ర్వాత‌కి చేరుకున్నాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో నాలుగు కార్ట‌న్ బాక్సుల్లో స‌ద‌రు వ్య‌క్తికి చెందిన వ‌స్తువులు వ‌చ్చాయి. ఈ వ‌స్తువుల‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించ‌గా బంగారం అక్ర‌మ ర‌వాణా బ‌హిర్గ‌త‌మైంది. 

కార్టన్ల‌లో బొమ్మ పెట్టెలు, బెడ్‌షీట్లు, ఇత‌ర వ‌స్తువులు ఉన్నాయి. బెడ్‌షీట్స్ కార్డుబోర్డు షీట్స్ చుట్టూ చుట్టిఉన్నాయి. ఈ చ‌ర్య కొంత అనుమానాస్ప‌దంగా క‌నిపించింది. దీంతో బెడ్‌షీట్ల‌ను చించి చుడ‌గా బంగారు రేకులు బ‌య‌ట‌ప‌డ్డాయి. బెడ్‌షీట్ రెండు పొర‌ల మ‌ధ్య ఉంచి బంగారాన్ని ర‌వాణా చేస్తున్నారు. నాలుగు కార్ట‌న్ బాక్సుల్లో సైతం ఇదేవిధంగా ఉంది. మొత్తం 1.45 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 78.4 ల‌క్ష‌లు. 

బంగారం అక్ర‌మ ర‌వాణా చేసిన ప్రయాణీకుడు తమిళనాడులోని కల్లకూరిచికి చెందినవాడు. దుబాయ్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. కోవిడ్ -19 సంక్షోభంతో ఉద్యోగం కోల్పోయాడు. ఇటీవ‌లే చెన్నైకి తిరిగి వచ్చాడు. నిందితుడిని అధికారులు అరెస్టు చేశారు.logo