మంగళవారం 19 జనవరి 2021
Crime - Jan 07, 2021 , 21:27:40

శంషాబాద్ విమానాశ్ర‌యంలో గోల్డ్ బార్స్ స్వాధీనం

శంషాబాద్ విమానాశ్ర‌యంలో గోల్డ్ బార్స్ స్వాధీనం

రంగారెడ్డి : అక్ర‌మ బంగారాన్ని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో గురువారం ఉద‌యం చోటుచేసుకుంది. ప్ర‌యాణికుల త‌నిఖీల్లో భాగంగా దుబాయ్ నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ఓ ప్ర‌యాణికుడి వ‌ద్ద క‌స్ట‌మ్స్ అధికారులు గోల్డ్ బార్స్‌ను అదేవిధంగా సిగ‌రెట్ల‌ను గుర్తించారు. స్వాధీనం చేసుకున్న బంగారు బిస్కెట్ల బరువు 349.800 గ్రాములు. దీని విలువ రూ .18.36 లక్షలు. సిగరెట్లు రూ. 1,20,000 విలువైనవి స్వాధీనం చేసుకున్నారు.