శుక్రవారం 03 జూలై 2020
Crime - Feb 03, 2020 , 05:56:16

11 తులాల బంగారం, 30 తులాల వెండి అపహరణ..

11 తులాల బంగారం,  30 తులాల వెండి అపహరణ..

బండ్లగూడ: ఇంటికి తాళం వేసి ఉన్న ఇంట్లోకి అదును చూసి దూరిన దొంగలు 30 తులాల వెండి, 11 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా చెందిన బోజ, సాధన దంపతులు, బండ్లగూడ జాగీర్‌ నగర పాలక సంస్థ పరిధిలోని భరత్‌నగర్‌ ప్రాంతంలో నివాసముంటున్నారు. ఇదిలా ఉంటే శనివారం సాయంత్రం బోజ సొంత పనుల మీద ఖమ్మం వెళ్లగా భార్య సాధన పక్కనే ఉన్న అమ్మగారింటికి వెళ్లింది. దీంతో, శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని విషయం గమనించిన దొంగలు బీరువాను ధ్వంసం చేసి 30 తులాల వెండి, 11తులాల బంగారం దోచుకెళ్లారు. ఆదివారం ఉదయం ఇంటియజమాని నారాయణరెడ్డి ఇంటిని పరిశీలించగా.. తలుపు తాళాలు పగలగొట్టి ఉండటంతో పోలీసులకు, సాధనకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి  కేసు దర్యాప్తు చేస్తున్నారు.  


logo