శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Crime - Jan 27, 2021 , 18:36:21

13 సార్లు జైలుకు వెళ్లొచ్చినా తీరు మారలేదు

13 సార్లు జైలుకు వెళ్లొచ్చినా తీరు మారలేదు

యాదాద్రి భువనగిరి : 13 సార్లు జైలుకు వెళ్లొచ్చినా ఆ దొంగ బుద్ధి మారలేదు. ఎప్పటిలాగే చోరీలకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. బైకులు, సెల్‌ఫోన్లు దొంగలిస్తున్న నిందితుడిని చౌటుప్పల్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని చౌటుప్పల్‌ ఏసీపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను ఏసీపీ సత్తయ్య వెల్లడించారు. చౌటుప్పల్‌ మండలం ఎస్‌ లింగోటంకు చెందిన కందగట్ల కిరణ్‌ (32) బైక్‌లు, సెల్‌ఫోన్లు దొంగతనం చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ప్రధానంగా బస్టాండ్లు, ఇండ్ల ముందు, సర్వీస్‌రోడ్ల వెంట పార్కింగ్‌ చేసిన బైక్‌లను దొంగలించేవాడు.

2017 నుంచి 13 సార్లు జైలుకు సైతం వెళ్లొచ్చాడు. అయినా తీరుమార్చుకొని కిరణ్‌ ఇటీవల తన గ్రామానికి చెందిన చేవెల్లి మహేష్‌(27), చౌటుప్పల్‌ గ్రామానికి చెందిన బండారి సంతోష్‌కుమార్‌(33), పస్తం మల్లేశం(20) తో కలిసి కిరణ్‌ టీమ్‌గా ఏర్పాడ్డాడు. చౌటుప్పల్‌తో పాటు ఏలూరు, మహబూబాబాద్‌, షాద్‌నగర్‌ పరిధిలో బైక్‌ల దొంగతనాలు చేయగా అయా పోలీస్‌స్టేషన్లలో ఈ మేరకు  బైక్‌ మిస్సింగ్‌ కేసులు నమోదయ్యాయి. 

ఈక్రమంలో సంస్థాన్‌నారాయణపురం మండల కేంద్రంలో బుధవారం పోలీసులు తనిఖీ చేస్తుండగా..బైక్‌పై వెళ్తున్న కిరణ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా తాను, తన టీమ్‌ సభ్యులు బైకులు దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నాడు. కిరణ్‌ తో పాటు అతని టీమ్‌ సభ్యులు మహేష్‌, సంతోష్‌కుమార్‌, మల్లేశాన్ని అరెస్ట్‌ చేశామని, ఇప్పటికే పలు కేసుల్లో నింధితునిగా ఉన్న కిరణ్‌పై పీడీ యాక్ట్‌ నమోదు చేశామని ఏసీపీ తెలిపారు. నింధితులను రామన్నపేట కోర్టులో హాజరు పరుస్తామని పేర్కొన్నారు. సమావేశంలో సీఐ ఎన్‌ శ్రీనివాస్‌, భువనగిరి సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ శివశంకర్‌, ఎస్‌ఐ నవీన్‌బాబు, మానస, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి..

సీఎం కేసీఆర్ గొప్ప లౌకికవాది : మంత్రులు

అనర్హులకు ఇండ్లు కేటాయిస్తే కఠిన చర్యలు : స్పీకర్‌ పోచారం 

తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం 

ఉనికి కోసమే ఉత్తమ్ పాకులాట : ఎమ్మెల్యే శానంపూడి 

రోడ్డు ప్రమాదంలో సైకిలిస్ట్ మృతి  

VIDEOS

logo