బుధవారం 27 జనవరి 2021
Crime - Nov 03, 2020 , 10:02:34

వాకింగ్‌ వెళ్లి.. నాలాలో పడి వృద్ధురాలు మృతి

వాకింగ్‌ వెళ్లి.. నాలాలో పడి వృద్ధురాలు మృతి

హైదరాబాద్ : ఉదయం వాకింగ్‌కు వెళ్లిన వృద్ధురాలు ప్రమాదివశాత్తు నాలాలో పడి మృతి చెందిన సంఘటన నగరంలో మంగళవారం చోటు చేసుకుంది. శారదానగర్‌కు చెందిన సరోజ (80) తెల్లవారు జామున ఉదయం ఆరు గంటల సమయంలో మార్నింగ్‌ వాకింగ్‌ కోసం ఇంటి నుంచి బయటకు వచ్చింది. ప్రమాదవశాత్తు సరూర్‌నగర్‌ చెరువు కింద నాలాలో పడి కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి హుటాహుటిన డీఆర్‌ఎఫ్‌ టీఎంను, పోలీసులు, సీహెచ్‌ఎంసీ సిబ్బందిని అప్రమత్తం చేశారు. గాలింపు చర్యలు చేపట్టగా.. చైతన్యపురిలోని హనుమాన్‌నగర్ నాలాలో మృతదేహం లభ్యమైంది. అనంతరం మృతదేహాన్ని పోర్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo