బుధవారం 28 అక్టోబర్ 2020
Crime - Sep 28, 2020 , 14:59:55

మహిళను కాపాడిన గోదావరి రివర్ పోలీసులు

మహిళను కాపాడిన గోదావరి రివర్ పోలీసులు

మంచిర్యాల : అత్తారింటి వేధింపుల తాళలేక ఓ మహిళ గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. జిల్లాలోని ముల్కల గ్రామానికి చెందిన గుడిగె మాలతి తన భర్త, కుటుంబ సభ్యులు మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని గోదావరి బ్రిడ్జి పై నుంచి నదిలోకి దూకడానికి ప్రయత్నించింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న గోదావరి రివర్ పోలీస్ సిబ్బంది ఆమెను గమనించి కాపాడారు. ఆమె కుటుంబ సభ్యులను పిలిపించి వారి సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి తన సోదరుడికి అప్పగించారు.


logo