ఆదివారం 24 జనవరి 2021
Crime - Jan 08, 2021 , 21:35:12

పెద్దపులి దాడిలో మేక మృతి

పెద్దపులి దాడిలో మేక మృతి

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ : జిల్లాలోని సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మండలం కడంబ గ్రామ శివారులో మేతకు వెళ్లి తిరిగి వస్తున్న మేకపై పులి దాడి చేసింది. కడంబకు చెందిన చంద్రయ్య మేక గ్రామ శివారులో మేతకు వెళ్లింది. సాయంత్రం తిరిగి వస్తుండగా పులి దాడి చేయడంతో మృతి చెందింది. ఈ విషయమై అటవీశాఖ అధికారి రాజేశ్వర్‌ను వివరణ కోరగా.. మాకు ఎలాంటి సమాచారం లేదని, తెలుసుకుంటామని తెలిపారు. పులి సంచరిస్తుందనే వార్తల నేపథ్యంలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

పోలీసులపై మందుబాబుల వీరంగం

బుధేరాలో నాటు కోళ్లు మృతి..ఆందోళనలో గ్రామస్తులు

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి 

రైతు వేదికలు దేశానికే ఆదర్శం : మంత్రి మల్లారెడ్డి 

రైల్వేలో రక్షణకే ప్రాధాన్యం : డీఆర్‌ఎం ఏకే గుప్తా


logo