గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Sep 06, 2020 , 21:10:16

ఒంట‌రిగా ఉన్న యువ‌తికి లిఫ్ట్ ఇచ్చి.. గెస్ట్ హౌస్‌కు తీసుకెళ్లి..

ఒంట‌రిగా ఉన్న యువ‌తికి లిఫ్ట్ ఇచ్చి.. గెస్ట్ హౌస్‌కు తీసుకెళ్లి..

మ‌ధుర : ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ రాష్ర్టం మ‌ధుర‌లోని బృందావన్ కొత్వాలి ప్రాంతంలో ఓ యువ‌తిపై ఐదుగురు వ్య‌క్తులు సామూహిక లైంగిక దాడికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న శుక్ర‌వారం జ‌ర‌గ్గా ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

పోలీసులు తెలిపిన వివ‌రాలు.. మ‌ధుర‌కు చెందిన ఓ యువ‌తి శుక్ర‌వారం రాత్రి 10 గంటల సమయంలో భరత్‌పూర్ మోర్ వద్ద హైవేపై నిల‌బ‌డి ఉంది. అప్పుడు ముగ్గురు కుర్రాళ్లు కారులో వ‌చ్చి అమెకు లిఫ్ట్ ఇస్తామ‌ని చెప్పి ఎక్కించుకొని బృందావ‌న్ ప్రాంతంలోని గెస్ట్‌హౌస్‌కు తిసుకెళ్లారు. అక్క‌డ మ‌రో ఇద్ద‌రు ఉండ‌గా మొత్తం ఐదుగురు క‌లిసి బ‌ల‌వంతంగా ఆమెపై రాత్రి మొత్తం ఒక‌రి త‌రువాత ఒక‌రు లైంగిక‌దాడికి పాల్ప‌డ్డారు. శ‌నివారం తెల్ల‌వారుజామున యువ‌తి వారి నుంచి త‌ప్పించుకొని బ‌య‌ట‌కొచ్చి కేక‌లు వేయ‌డంతో.. చుట్టుప‌క్క‌ల వారు గ‌మ‌నించి ఏమైంద‌ని అడ‌గ్గా జ‌రిగిన విష‌యాన్ని యువ‌తి వారికి చెప్పింది. వెంట‌నే ప్ర‌జ‌లు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో వారు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని యువ‌తిని ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. 

సీఐ సదర్ రమేశ్ తివారీ మాట్లాడుతూ బాధితురాలి ఫిర్యాదు మేర‌కు ఐదుగురిపై కేసు న‌మోదు చేశామ‌ని ఇందులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలిపారు. మిగ‌తా ఇద్ద‌రి కోసం వెతుకుతున్నామ‌ని వారు దొరికిన త‌రువాత ద‌ర్యాప్తు ప్రారంభిస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo