సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Aug 26, 2020 , 19:35:53

ఆటోడ్రైవర్‌తో లేచిపోయిన గర్ల్‌ఫ్రెండ్‌.. ప్రతీకారంగా 70 సెల్‌ఫోన్లు దొంగిలించిన ప్రియుడు!

ఆటోడ్రైవర్‌తో లేచిపోయిన గర్ల్‌ఫ్రెండ్‌.. ప్రతీకారంగా 70 సెల్‌ఫోన్లు దొంగిలించిన ప్రియుడు!

పూణె : మహారాష్ర్టలోని పూణెలో ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. గర్ల్‌ఫ్రెండ్‌ ఆటో డ్రైవర్‌తో లేచిపోయి వివాహం చేసుకోవడంతో ఆగ్రహం చెందిన ప్రియుడు ఆటోవాలాల ఫోన్‌లను దొంగిలించడం ప్రారంభించాడు. 

పోలీసులు తెలిపిన వివరాలు..  అహ్మదాబాద్‌కు చెందిన ఆసిఫ్‌ అలియాస్‌ భురభాయ్‌ ఆరిఫ్‌ స్థానికంగా రెస్టారెంట్‌ నడుపుతుండేవాడు. ఆరిఫ్‌ ఒక యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దానికి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో రెస్టారెంట్‌ను అమ్మేసి ఆ డబ్బు తీసుకొని ప్రియురాలితో కలిసి కొత్త జీవితం ప్రారంభిద్దామని 2019లో పూణెకు వచ్చేశాడు. రెండు రోజులకే గర్ల్‌ఫ్రెండ్‌.. ఆరిఫ్‌ వద్ద డబ్బులు నొక్కేసి ఓ ఆటోడ్రైవర్‌తో లేచిపోయి వివాహం చేసుకొని అహ్మదాబాద్‌లో నివసిస్తోంది. 

ఆగ్రహం చెందిన ఆరిఫ్‌ అహ్మదాబాద్‌ వెళ్లి తనతో రావాల్సిందిగా ప్రియురాలిని కోరగా.. ఆమె ససేమిరా అనడంతో చేసేది లేక తిరిగి పూణెకు వచ్చి స్నేహితుడి ఇంట్లో నివాసం ఉంటున్నాడు. తాను పెళ్లి చేసుకోవాలనుకున్న యువతి ఆటో డ్రైవర్‌తో లేచిపోవడంతో తీవ్ర ఆగ్రహం చెందిన ఆరిఫ్‌.. అప్పటి నుంచి ఆటోడ్రైవర్ల సెల్‌ఫోన్లు దొంగిలించడం ప్రారంభించాడు. సుమారు 70 మంది ఆటోడ్రైవర్ల దగ్గర సెల్‌ఫోన్లు అపహరించిన తరువాత.. ఆరుగురు ఆటో డ్రైవర్లు వేర్వేరు పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ కేసుల్లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం ఆరిఫ్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

అతడి వద్ద నుంచి 12 సెలఫోన్లు స్వాధీనం చేసుకొని మిగిలిన వాటి గురించి విచారణ చేపడుతున్నారు. మంగళవారం అతడిని కోర్డులో హాజరుపర్చగా తదుపరి విచారణ గురువారం జరుగనుంది.


logo