ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Sep 16, 2020 , 18:38:19

ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి వీరంగం

ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి వీరంగం

కాన్పూర్‌ : ప్రియుడి ఇంటి ఎదుట ఓ యువతి వీరంగం సృష్టించింది. పెళ్లికి నిరాకరించడంతో ప్రేమికుడితో పాటు అతడి తల్లిదండ్రులను కొట్టింది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరగ్గా దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.  

కాన్పూర్‌లోని బార్రా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జారౌలి ప్రాంతానికి చెందిన దీపక్‌ అదే ప్రాంతానికి చెందిన మరో యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి వివాహానికి పెద్దలు కూడా ఒప్పుకోవడంతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకొని లాక్‌డౌన్‌ అనంతరం పెళ్లి పెట్టుకుందామని నిర్ణయం తీసుకున్నారు.  

లాక్‌డౌన్ ముగిసిన తరువాత యువతి పెళ్లి ప్రస్తావన తేగా దీపక్‌ దీనికి నిరాకరించాడు. దీంతో తీవ్ర కోపోద్రిక్తురాలైన యువతి తన కుటుంబసభ్యులతో కలిసి దీపిక్‌ ఇంటికి వెళ్లి అతడిని రోడ్డు మీదికి ఈడ్చుకొచ్చి చితకబాదింది. అడ్డొచ్చిన అతడి తల్లిదండ్రులను కూడా కొట్టింది. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరి తరపు బంధువులను స్టేషన్‌కు తరలించారు. పోలీస్‌ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దీపక్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo