e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News పెండ్లికి నిరాక‌రించ‌డంతో ప్రియుడి ఇంటి ఎదుట యువ‌తి ధ‌ర్నా

పెండ్లికి నిరాక‌రించ‌డంతో ప్రియుడి ఇంటి ఎదుట యువ‌తి ధ‌ర్నా

పెండ్లికి నిరాక‌రించ‌డంతో ప్రియుడి ఇంటి ఎదుట యువ‌తి ధ‌ర్నా

ల‌క్నో : త‌ల్లితండ్రులు అంగీక‌రించ‌డం లేద‌ని ప్రియురాలిని పెండ్లి చేసుకునేందుకు నిరాక‌రించిన ప్రియుడి ఇంటి ముందు యువ‌తి ధ‌ర్నాకు దిగింది. ఈనెల 19న యూపీలోని క‌న్నౌజ్ జిల్లా స‌రిక్ గ్రామంలోని బాయ్ ఫ్రెండ్ ఇంటికి చేరుకున్న యువ‌తి అప్ప‌టినుంచి అక్క‌డే ధ‌ర్నా కొన‌సాగిస్తోంది. తాను అత‌డిని పెండ్లి చేసుకునేంత వ‌ర‌కూ క‌దిలేది లేద‌ని, లేకుంటే ఆత్మ‌హ‌త్య‌కైనా వెనుకాడ‌న‌ని ఆమె స్ప‌ష్టం చేసింది. యువ‌తి ఆందోళ‌న‌తో కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ప్రియుడు ఇంటి నుంచి ఉడాయించాడు.

ఏడాది కాలంగా స‌న్నిహితంగా మెలుగుతున్న వీరు వివాహ బంధంతో ఒక్క‌ట‌వ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. వీరి సంబంధాన్ని యువ‌కుడి త‌ల్లితండ్రులు వ్య‌తిరేకించ‌డంతో ఏప్రిల్ 8న ఇండ్ల నుంచి పారిపోయారు. యువ‌తితో క‌లిసి యువ‌కుడు ఇంటికి రాగా అత‌డి త‌ల్లితండ్రులు ఆమెతో త‌మ కుమారుడి సంబంధానికి అడ్డుచెప్పారు. ఆపై యువ‌తి ఫిర్యాదుతో వ్య‌వ‌హారం కోర్టుకు చేరింది. కోర్టు వేదిక‌గా యువ‌తితో వివాహానికి యువ‌కుడి కుటుంబం అంగీక‌రించింది. మ‌రోసారి యువ‌కుడి కుటుంబం యూట‌ర్న్ తీసుకుని వివాహానికి అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంతో ఆమె ఏకంగా ప్రియుడి ఇంటి వ‌ద్ద ధ‌ర్నాకు దిగింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పెండ్లికి నిరాక‌రించ‌డంతో ప్రియుడి ఇంటి ఎదుట యువ‌తి ధ‌ర్నా

ట్రెండింగ్‌

Advertisement