మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Jul 30, 2020 , 20:22:28

టీవీ, మొబైల్‌ చూడవద్దన్నందుకు విద్యార్థిని ఆత్మహత్య

టీవీ, మొబైల్‌ చూడవద్దన్నందుకు విద్యార్థిని ఆత్మహత్య

సూరత్‌: టీవీ, మొబైల్‌ చూడడం మానేయమని వారించినందుకు ఓ బాలిక బలవన్మరణానికి పాల్పడింది. తన తల్లిదండ్రులకు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ సంఘటన గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌ జిల్లాలోని కతర్‌గాం గ్రామంలో జరిగింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జహాన్విమారు(16) పదో తరగతి చదువుతోంది. ఆమెకు ఇటీవల తలనొప్పితో బాధపడుతుండగా, తల్లిదండ్రులు వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. అతడు టీవీ, మొబైల్‌ చూడడం పూర్తిగా మానేయమని సూచించాడు. దీంతో తల్లిదండ్రులు ఆమెకు ఇంట్లో టీవీ, మొబైల్‌ సౌకర్యాన్ని కట్‌ చేశారు. 

ఈ క్రమంలో తల్లిదండ్రులు బయటకు వెళ్లగా ఇంట్లో అమ్మమ్మ ఒక్కరే ఉండడం చూసిన జహాన్వి బట్టలు మార్చుకుంటానని వేరే రూంలోకి వెళ్లింది. ఎంతసేపటికీ రాకపోవడంతో అనుమానం వచ్చిన అమ్మమ్మ, తల్లిదండ్రులకు సమాచారమందించింది. వారు వచ్చి తలుపులు బద్దలుకొట్టి చూడగా, గదిలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని కనిపించింది. కూతురును విగతజీవిగా చూసిన ఆ తల్లిదండ్రుల గుండెలవిసేలా రోదించారు. పోలీసులకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo