సోమవారం 28 సెప్టెంబర్ 2020
Crime - Aug 10, 2020 , 13:17:11

‘బాలికను కిడ్నాప్‌ చేసి నిర్భయను హింసించిన రీతిలో హింసించారు’

‘బాలికను కిడ్నాప్‌ చేసి నిర్భయను హింసించిన రీతిలో హింసించారు’

హాపూర్ : ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం హపూర్ జిల్లా గర్ ముక్తేశ్వర్ ప్రాంతంలో గురువారం ఆరేండ్ల బాలికను కిడ్నాప్‌ చేసి అత్యంత కిరాతకంగా లైంగికదాడికి పాల్పడగా.. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిందితులు పరారీలో ఉండగా వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. బాలిక తల్లిదండ్రులు, స్థానికుల సమాచారం ఆధారంగా పోలీసులు నిందితులకు సంబంధించి మూడు నమూనా చిత్రాలను విడుదల చేశారు. 

అయితే వైద్య పరీక్షల్లో షాకింగ్‌ నిజాలు బయటికొచ్చాయి. బాలికను నిందితులు తీవ్రంగా హింసించారని వైద్యులు తెలిపారు. బాలికకు ఇప్పటికే ఒక శస్త్రచికిత్స జరగ్గా.. ఇంకా ఆమె పరిస్థితి మెరుగు పడలేదని పేర్కొన్నారు. 2012లో నిర్భయను సామూహికంగా హింసించి  లైంగిక దాడి చేసిన విధంగానే ఈ బాలికను కూడా హింసించారని వైద్యులు తెలిపారు. బాలిక చికిత్స పొందుతున్న మీరట్ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గార్గ్ మాట్లాడుతూ బాలిక ప్రైవేట్‌ భాగాలు బాగా ఛిద్రమయ్యాయని, ఆమెకు మరిన్ని శస్త్ర చికిత్సలు అవసరమవుతాయని తెలిపారు. 

హపూర్ ఎస్పీ సంజీవ్ సుమన్ మాట్లాడుతూ బాలిక చికిత్స పొందుతుండడంతో వాంగ్మూలం తీసుకోలేకపోయామన్నారు. నిందితులను అరెస్టు చేయడానికి ఆరు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిలాఉండగా ఈ సంఘటనపై సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ నిరసనలు నిర్వహిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo