శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Jun 25, 2020 , 15:00:38

బాలిక ఆత్మ‌హ‌త్య‌.. ర‌హ‌స్యంగా ఖ‌న‌నం

బాలిక ఆత్మ‌హ‌త్య‌.. ర‌హ‌స్యంగా ఖ‌న‌నం

న్యూఢిల్లీ : ఓ 16 బాలిక త‌న ఇంట్లోనే ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఆ త‌ర్వాత ఆమెను కుటుంబ స‌భ్యులు ర‌హ‌స్యంగా ఖ‌న‌నం చేశారు. స్థానికుడు ఇచ్చిన స‌మాచారంతో.. ఈ ఘ‌ట‌న వెలుగు చూసింది. 

జార్ఖండ్ కు చెందిన ఓ కుటుంబం తూర్పు ఢిల్లీలో గ‌త కొన్నేళ్ల నుంచి నివాస‌ముంటోంది. బాలిక త‌న త‌ల్లి, ఇద్ద‌రు తోబుట్టువుల‌తో క‌లిసి ఉంటోంది. ఆమె తండ్రి రెండేండ్ల క్రితం చ‌నిపోయాడు. ఏమైందో తెలియ‌దు కానీ.. బాలిక సోమ‌వారం ఇంట్లోనే ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఆ త‌ర్వాత ఎవ‌రికీ తెలియ‌కుండా కుటుంబ స‌భ్యులు.. మృత‌దేహాన్ని పూడ్చిపెట్టారు. 

ఈ ఘ‌ట‌న‌ను స్థానికంగా ఉన్న ఓ వ్య‌క్తి పోలీసుల దృష్టికి తెచ్చాడు. దీంతో పోలీసులు ఆ ఇంటికి మంగ‌ళ‌వారం చేరుకుని.. పూడ్చిపెట్టిన శ‌వాన్ని బ‌య‌ట‌కు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం మృత‌దేహాన్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆమె న‌మూనాల‌ను కొవిడ్ ప‌రీక్ష‌ల‌కు పంపారు. 

బాలిక ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ ప్రారంభించారు. ఘ‌ట‌నాస్థ‌లిలో ఎలాంటి సూసైడ్ నోట్ ల‌భించ‌లేద‌ని పోలీసులు చెప్పారు. 


logo