బుధవారం 03 మార్చి 2021
Crime - Jan 27, 2021 , 18:45:37

లైంగిక వేధింపులతో వేసారి..

లైంగిక వేధింపులతో వేసారి..

కాన్పూర్‌ : ఇద్దరు యువకులు నిత్యం లైంగిక వేధింపులకు గురిచేస్తుండటంతో పదవ తరగతి బాలిక బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగుచూసింది. కాన్పూర్‌కు సమీపంలోని అసలత్‌గంజ్‌ పట్టణంలో ఈ దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు తనను లైంగికంగా వేధిస్తున్నారని రాసిన లేఖ బాధితురాలి గదిలో లభ్యమైందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు కేసు విచారణ చేపట్టారు.

తమ పొరుగున ఉండే ఇద్దరు యువకులు ప్రతిరోజూ బాలికను వేధించేవారని బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ ప్రతిష్ట దిగజారుతుందనే భయంతో బాలిక మౌనంగా ఉండటంతో నిందితుల ఆగడాలు మితిమీరాయని చెప్పారు. యువకుల ప్రవర్తన శ్రుతిమించడంతో విసిగిపోయిన బాలిక ఉరివేసుకుని మరణించడం కుటుంబ సభ్యుల్లో విషాదం నింపింది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. 

VIDEOS

logo