మంగళవారం 26 జనవరి 2021
Crime - Dec 17, 2020 , 18:14:58

సెల్‌ఫోన్‌లో చాటింగ్ వద్దన్నందుకు బాలిక ఆత్మహత్య

సెల్‌ఫోన్‌లో చాటింగ్ వద్దన్నందుకు బాలిక ఆత్మహత్య

పెద్దపల్లి :సెల్‌ఫోన్‌లో చాటింగ్ చేయవద్దని తండ్రి మందలించినందుకు కూతురు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన జిల్లాలోని రామగిరి మండలం నవాబుపేటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరా ప్రకారం..గ్రామానిక చెందిన చెన్నూరి నిహారిక (16)అనే బాలికను తన తండ్రి సెల్ సెల్‌ఫోన్‌లో చాటింగ్ చేస్తుండగా చూసి మందలించినందుకు కలత చెంది బావిలో పడి ఆత్మహత్య చేసుకుందని ఎస్ఐ మహేందర్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా దుబ్యాల గ్రామానికి చెందిన చెన్నూరి జగపతి తన భార్య పిల్లల తో కలసి నవాబుపేట గ్రామంలో నివాసం ఉంటున్నారు.

ఈ క్రమంలో తన కూతురు నిహారిక ఈ నెల 14న రాత్రి సెల్‌ఫోన్‌లో  చాటింగ్ చేయడం చూసి ఫోన్‌లో చాటింగ్ చేయవద్దని మందలించాడు.  ఇదే విషయాన్ని మనసులో పెట్టుకున్న నిహారిక మరుసటి రోజు ఇంటి నుంచి వెళ్లిపోయింది. అప్పటి నుంచి నిహారిక జాడ కోసం కుటుంబ సభ్యులు వెతకగా గురువారం గ్రామ శివారులో గల వ్యవసాయ బావిలో శవమై తేలినట్లు తెలిపారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


logo