శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Aug 26, 2020 , 09:20:19

17 ఏండ్ల యువ‌తిపై అత్యాచారం.. ఆపై హ‌త్య‌

17 ఏండ్ల యువ‌తిపై అత్యాచారం.. ఆపై హ‌త్య‌

ల‌క్నో: మృగాళ్ల వేట‌కు మ‌రో బాలిక బ‌లైంది. స్కాల‌ర్‌షిప్ ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి వెళ్లిన యువ‌తి మ‌ళ్లీ ఇంటికి తిరిగిరాలేదు. రెండోరోజు మెడ‌పై తీవ్రగాయ‌ల‌తో ఊరి చివ‌రన ఉన్న చెరువులో ప‌డిఉంది. ఆ అమ్మాయిపై లైంగిక‌దాడి చేసిన దుండ‌గులు కౄరంగా గొంతుకోసి చంపేశారు. ఈ విషాధ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగింది. రాష్ట్రంలో గ‌త ప‌దిరోజుల్లో వ‌రుస‌గా ఇది రెండో ఘ‌ట‌న‌.  

రాష్ట్రంలోని ఖేరీ జిల్లా ల‌ఖింపురా గ్రామానికి చెందిన 17 యువ‌తి స్కాల‌ర్‌షిప్ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌‌డానికి సోమ‌వారం ఉద‌యం ప‌క్క ఊరికి వెళ్లింది. సాయంత్ర‌మైన ఇంటికి తిరిగిరాక‌పోవ‌డంతో, ఊరంతా వెతికిన త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అయితే మంగ‌ళవారం ఉద‌యం ఊరికి 2 వంద‌ల మీట‌ర్ల దూరంలో ఉన్న చెరువు స‌మీపంలో తీవ్ర‌గాయాల‌తో విగ‌త జీవిగా ప‌డిఉన్న‌ది. స‌మాచారం అందుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ద‌వాఖాన‌కు త‌ర‌లించారు. 

పోస్టుమార్టం నివేదిక‌లో యువ‌తి లైంగిక దాడికి గురైంద‌ని తేలింద‌ని, అనంత‌రం ప‌దునైన ఆయుధంతో గొంతుకోసి చంపివేశార‌ని ఖేరీ ఎస్పీ స‌తేంద‌ర్ కుమార్ వెల్ల‌డించారు. బాలిక మృత‌దేహం ఊరిచివ‌ర‌న ఉన్న చేరువు స‌మీపంలో ల‌భించింద‌ని చెప్పారు. 

త‌మ‌కు ఏం చెప్పాలో తెలియ‌డం లేద‌ని, త‌మ‌కు ఎవ‌రిపై అనుమానం లేద‌ని మృతురాలి బంధువులు తెలిపారు. సోమ‌వారం ఉద‌యం 8.30 గంట‌ల‌కు ఇంటి నుంచి బ‌య‌టికి వెళ్లింద‌ని చెప్పారు. 

ఖేరీ జిల్లాలో ఇలాంటి ఘ‌ట‌న జ‌ర‌గ‌డం గ‌త ప‌దిరోజుల్లో ఇదిరెండోసారి. ఆగ‌స్టు 15న 13 చిన్నారిపై అత్యాచారంచేసి హ‌త్య‌చేశారు. అనంత‌రం ఆ మృతదేహాన్ని చెరుకు తోట‌లో ప‌డేశారు. ఈ కేసులో ఇద్ద‌రు మ‌హిళ‌ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. logo