మంగళవారం 19 జనవరి 2021
Crime - Nov 23, 2020 , 10:54:58

అనుమానాస్పద స్థితిలో జీహెచ్‌ఎంసీ ఉద్యోగి మృతి

అనుమానాస్పద స్థితిలో జీహెచ్‌ఎంసీ ఉద్యోగి మృతి

హైదరాబాద్‌ : గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పరిధిలో పని చేస్తున్న ఉద్యోగి రంగారెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జవహర్‌నగర్‌ డంప్‌ యార్డ్‌ వద్ద మృతదేహం లభ్యమైంది. మృతుడి శరీరంపై పలు చోట్ల కత్తితో పొడిచినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయి. జూబ్లీహిల్స్‌ జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో రంగారెడ్డి సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నారు. ఆయన అదృశ్యంపై ఆదివారం జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో అదృశ్యం కేసు నమోదైంది. సంఘటనా స్థలాన్ని స్థానిక పోలీసులు సందర్శించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఆయనను హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. శరీరంపై ఉన్న గాయాలు బలం చేకూరుస్తున్నాయి. హత్యకు గల కారణాలు ఏమై ఉంటాయనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.