బుధవారం 28 అక్టోబర్ 2020
Crime - Sep 28, 2020 , 11:37:01

సంజూ శాంస‌న్‌.. కాబోయే ధోనీ !

సంజూ శాంస‌న్‌.. కాబోయే ధోనీ !

హైద‌రాబాద్‌: రాజ‌స్థాన్ ప్లేయ‌ర్ సంజూ శాంస‌న్ ఐపీఎల్‌లో భాగంగా కింగ్స్ లెవ‌న్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో దుమ్మురేపాడు.  కేవ‌లం 42 బంతుల్లో 85 ర‌న్స్ చేసి జ‌ట్టు విజ‌యంలో అత‌ను కీల‌క పాత్ర పోషించాడు.  హై స్కోర్ గేమ్‌లో  అద్భుత విక్ట‌రీ సాధించిన రాజ‌స్థాన్ ఆట‌గాడిపై కాంగ్రెస్ ఎంపీ శ‌శి థ‌రూర్ ప్ర‌శంస‌లు కురిపించారు.  చెన్నైతో జ‌రిగిన తొలి మ్యాచ్‌లో శాంస‌న్ 74 రన్స్ చేశాడు. వ‌రుస‌గా రెండ‌వ మ్యాచ్‌లోనూ సంజూ రాణించ‌డంతో శ‌శిథ‌రూర్ అత‌న్ని కొనియాడారు. కేర‌ళ‌కు చెందిన సంజూ‌ను మెచ్చుకుంటూ.. ధోనీ స్థానాన్ని శాంస‌న్ పూర్తి చేస్తాడ‌ని శ‌శిథ‌రూర్ ట్వీట్ చేశారు.  రాజస్థాన్ అద్భుత‌మైన విజ‌యం సాధించింద‌ని, శాంస‌న్ త‌న‌కు ద‌శాబ్ధం నుంచి తెలుసు అని, 14 ఏళ్ల వ‌య‌సులో ఉన్న‌ప్పుడే.. కాబోయే ధోనీ శాంస‌న్ అని పేర్కొన్న‌ట్లు థ‌రూర్ గుర్తు చేశారు.  ఆ రోజు వ‌చ్చేసింద‌ని, రెండు అద్భుత ఇన్నింగ్స్‌తో అత‌ను వ‌రల్డ్ క్లాస్ ప్లేయ‌ర్ అని నిరూపించాడ‌న్నారు.  శ‌శిథ‌రూర్ ట్వీట్ చేసిన కొన్ని నిమిషాల్లో గంభీర్ కౌంటర్ ఇచ్చారు.  సంజూ శాంస‌న్ తానేంటో నిరూపించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. సంజూ శాంస‌న్ ఇండియ‌న్ క్రికెట‌ర్‌గా ఉంటాడ‌‌ని గంభీర్ అన్నారు.  


logo