శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Crime - Sep 15, 2020 , 20:02:28

భ‌ద్రాచ‌లంలో రూ. 34 ల‌క్ష‌ల విలువైన గంజాయి ప‌ట్టివేత‌

భ‌ద్రాచ‌లంలో రూ. 34 ల‌క్ష‌ల విలువైన గంజాయి ప‌ట్టివేత‌

భ‌ద్రాద్రి కొత్త‌గూడెం : భ‌ద్రాచ‌లంలో పోలీసులు మంగ‌ళ‌వారం 226.5 కేజీల గంజాయిని ప‌ట్టుకున్నారు. దీని విలువ రూ. 33.97 ల‌క్ష‌లుగా స‌మాచారం. ఏఎస్పీ రాజేష్ చంద్ర వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఎస్ఐ మ‌హేశ్ త‌న సిబ్బందితో ఫారెస్ట్ చెక్‌పోస్ట్ వ‌ద్ద వాహ‌న త‌నిఖీలు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా గంజాయి ర‌వాణాను గుర్తించి ప‌ట్టుకున్నారు. నిందితుల‌ను ఒడిశాలోని మల్కన్‌గిరికి చెందిన సుజిత్ గోల్డర్, మనోజిత్ రాయ్‌గా గుర్తించారు. గంజాయిని మిని ట్ర‌క్కులో మ‌ల్క‌న్‌గిరి నుంచి విజ‌య‌వాడ‌కు త‌ర‌లిస్తున్నారు. 


logo